కృష్ణా జిల్లా మైలవరంలోని పొందుగల మార్గంలో నివాసం ఉంటున్న కోదాటి పాండు రంగమ్మ అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ఉదయం స్నానం చేసి బాత్రూమ్ నుంచి ఇంట్లోకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గొలుసు తీసుకెళుతున్న సమయంలో జరిగిన పెనుగలాటలో సగ భాగం ఆమె చేతిలో ఉండగా.. మరో సగం గొలుసుతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి సమాచారంతో సీఐ శ్రీను ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
వృద్ధురాలిపై దాడి.. బంగారం గొలుసు అపహరణ - mailavaram chain snaching news
వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారు గొలుసు అపహరించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది.
వృద్ధురాలిపై దాడి.. బంగారం గొలుసు అపహరణ