సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల పేరు, చిరునామాల్లో లోపాలను సవరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ తెలిపారు. ఓటర్లుగా నమోదు అయిన వారి ఓటర్ కార్డులో తప్పులు, చిరునామాలో తప్పులు, తదితరులు సరిచేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫారం- 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీనుంచి బూత్ లెవెల్ కేంద్రాల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో 11 వేల కామన్ సర్వీస్ సెంటర్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని.... పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డు, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులు , బ్యాంక్ పాస్ బుక్, రైతు గుర్తింపు కార్డు, కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపునచ్చిన అధికారిక పత్రాలతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చునని వివరించారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయంలోనూ, డివిజన్ ఆఫిస్, తహశీల్ధార్ కార్యాలయంలోనూ ప్రత్యేక వ్యవస్థను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఇంటివద్ద నుంచే ఒటర్ల కు సంబంధించి మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఓటర్స్ హెల్ప్, 1950 కాల్ సెంటర్, ద్వారా తగిన మార్పులను చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. మార్పులు చేర్పుల కోసం ఫారమ్-8 ద్వారా దరఖాస్తులను సమర్పించాలని ..ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ధారించుకొని సరిచేస్తారని తెలిపారు. వికలాంగ ఓటర్లు 1950 హెల్ప్ లైన్ ద్వారా వివరాలు తెలియజేస్తే ఓటర్ల నమోదుకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఓటరు ఐడీ తప్పుల సవరణకు మరో అవకాశం
ఓటరు కార్డులోని తప్పుల సవరణల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈసీ