తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చాకిరాలలో ఘోర ప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువలోకి స్కార్పియో కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు సమాచారం. చాకిరాలలో మిత్రుని వివాహానికి హాజరై తిరిగొస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గల్లంతైనవారిని అబ్దుల్ అజీజ్ (40), రాజేశ్ (38), జిమ్సన్ (40), సంతోష్ (36), పవన్ (38), నగేశ్ (36)లుగా గుర్తించారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు.
సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు గల్లంతు - సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు గల్లంతు
కారులో స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలోకి ఆ కారు దూసుకెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. సూర్యాపేట జిల్లా చాకిరాల వద్ద ఈ ఘటన జరిగింది.
సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు గల్లంతు
TAGGED:
car accident in telangana