రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు, దౌర్జన్యాలు, రాళ్లు, కోడిగుడ్లు విసురుకునే విష సంస్కృతికి ఇప్పటికైనా ముగింపు పలకాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కోరారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకున్న వైకాపా నేతల తీరును తప్పుబట్టారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని భాజపా రాజకీయ తీర్మానం చేసిన విషయాన్ని జీవీఎల్ పునరుద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాతే పేదలకు స్థలాలివ్వాలని అన్నారు.
'అమరావతే రాజధాని అన్న అంశానికి కట్టుబడి ఉన్నాం'
అమరావతే రాజధానిగా ఉండాలన్న అంశానికి తాము కట్టుబడి ఉన్నామని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వైకాపా తీరును ఆయన తప్పుబట్టారు. రాయలసీమలో హైకోర్టు పెడతామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టామన్న జీవీఎల్... దీనిపై తాను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి మాట్లాడతానన్నారు.
భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు