విజయవాడలో ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ సాంస్కృతిక పోటీలను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. మహానుభావులు చూపిన మార్గంలో యువత పయనించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అన్నారు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను కలిపేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని మంత్రి స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక.. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.
యువజనోత్సవ సాంస్కృతిక పోటీలు ప్రారంభం
విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను కలిపేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ సాంస్కృతిక పోటీలను మంత్రి ప్రారంభించారు.
విజయవాడలో యువజనోత్సవ సాంస్కృతిక పోటీలు ప్రారంభం