గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనాడు నిర్వహిస్తున్న పోటీలు ఎంతో స్ఫూర్తిదాయకమని మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేక అధికారి వల్లూరి క్రాంతి అభిప్రాయపడ్డారు. పోటీల్లో గెలుపు ఓటములు సహజమని.... గెలుపొస్తే పొంగిపోయి.. ఓటమి పాలైతే కుంగిపోవద్దని హితవు పలికారు.
ఈ జిల్లా స్థాయిల్లో 24 సీనియర్ జట్లు, 36 జూనియర్ జట్లు పోటీ పడుతుండగా.. ఈ నెల 26 వరకూ పోటీలు కొనసాగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.