కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయతిపురం భూములను ఎకరం లక్ష రూపాయల చొప్పున అప్పట్లో బొత్స మంత్రిగా ఉన్న ప్రభుత్వమే ఏపీఐఐసీకి సిఫారసు చేసిందని తెదేపా నేత భరత్ తెలిపారు. ఆ రేటుకు 13 రెట్లు పెంచి ఎకరం 13.50 లక్షలకు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే వాటిని వక్రీకరించి బొత్స దుష్ప్రచారం చేయడం గర్హనీయమన్నారు. అయినా ఆ భూములు ఇప్పటికీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని... తమ సంస్థ ఆధ్వర్యంలో లేవని స్పష్టం చేశారు. ఈ భూములపై వేరేవాళ్లు కోర్టుకు వెళ్తే, అప్పటి నుంచి కోర్టులోనే ఉందన్నారు. ఈ భూములు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా బొత్స కు తెలియదని మండిపడ్డారు. భూములు తమవద్ద ఉన్నట్టు తేలితే ఉచితంగానే వెనక్కి ఇస్తామని చెప్పారు. ఒకవేళ అబద్ధమని రుజువైతే ఏం చేస్తారని సవాల్ విసిరారు.
'ఆ భూములు మా దగ్గర ఉన్నట్టు రుజువైతే ఉచితంగా ఇస్తా' - botsa
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కేటాయింపు అంశాన్ని తెదేపాకు అంటగట్టారని తెదేపా నేత భరత్ ఆరోపించారు.
భరత్