విధి నిర్వహణలో తమ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ఆశా కార్యకర్తలు ప్రజల కోసం అనునిత్యం విధులు నిర్వహించడం అభినందనీయమని స్థానిక మదర్ థెరిస్సా మహిళా మండలి అధ్యక్షురాలు కోయా సుధా ప్రశంసించారు. అనంతరం మండలంలోని ఆశా కార్యకర్తలందరికీ పండ్లు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులని అందజేశారు. కనిమెర్ల తండా గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ వారికి మదర్ తెరిస్సా మహిళా మండలి తరుపున నీటి మోటార్ని వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం సభ్యులు, మహిళా మండలి సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆశావర్కర్లకు కరోనాపై అవగాహన సదస్సు - asha workers latest news update
కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివని ఆరోగ్య కేంద్రం వైద్యులు నరేష్ కుమార్ కొనియాడారు. స్థానిక కల్యాణ మండపంలో కృష్ణా జిల్లా మానవ హక్కుల మిషన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అయన కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణలపై ప్రసంగించారు.
ఆశావర్కర్లకు కరోనాపై ఆవగాహన సదస్సు