కరోనా పాజిటివ్ వచ్చిందంటే చాలు బంధువులు ఇంటి దరిదాపులకి రావడం లేదు. ఇక కొవిడ్‌తో ఎవరన్నా మరణిస్తే దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకురాని ఘటనలు చూస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల అందరు ఉండి కూడా అనాథలుగా గడపాల్సిన దుస్థితి. ఇటువంటి నేపథ్యంలో కృష్ణాజిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులు, కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం నింపుతున్నారు. అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో సింహాద్రి పర్యటించి... కరోనా బాధితులను కలుసుకొని వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి తెలుసుకుంటున్నారు. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని మన ధైర్యమే కరోనాకి మందని ధైర్యం చెబుతున్నారు.
కరోనా బాధితులకు స్వయంగా ధైర్యం చెప్తున్న ఎమ్మెల్యే - ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
కరోనా పాజిటివ్ అని తెలిస్తే చాలు.. కుటుంబ సభ్యులే పరాయి వాళ్లు అయిపోతున్న రోజులివి. ఇక కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రావటం లేదు. అటువంటిది ఓ ఎమ్మెల్యే... కరోనా సోకిన వారిని.. వారి కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నేనున్నాను మీకు అంటూ భరోసా ఇస్తున్నారు. ఆ మనసున్న ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలని ఉందా?
వారం రోజుల క్రితం నాగాయలంకలో ఓ వ్యక్తి కరోనాతో మరణించగా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఎస్సై, డీటీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల క్రితం అతని తల్లి మరణించగా ఆ మరుసటి రోజు ఎమ్మెల్యే దగ్గరుండి ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఎమ్మెల్యే సింహాద్రి ప్రతిరోజూ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు మనోధైర్యం ఇవ్వడంతోపాటు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట ఈవో తోట శ్రీనివాసరావు, వీఆర్వో శేషుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ పవన్ కుమార్ ఉంటున్నారు.
ఇదీ చదవండి:నాగాయలంక మార్కెట్ యార్డులో కరోనా టెస్టులు