ఆటో, కార్ డ్రైవర్ లకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న 10 వేల రూపాయల ఆర్థిక సహాయ పథకంపై.. పోలీసులు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రవి కుమార్ నూజివీడు పట్టణంలో పలువురు ఆటో, కార్ డ్రైవర్ లకు ఈ పథకంపై పూర్తి వివరాలు చెప్పారు. సొంత వాహనం కలిగి ఉండి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారికి పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు. సమాచారం కోసం గ్రామ వాలంటీర్లను, వీఆర్వో లను సంప్రదించవచ్చన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద పథకంపై అవగాహన కల్పించడమే కాక... ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆటో, టాక్సీ డ్రైవర్ల ప్రోత్సాహక పథకానికి.. 14 నుంచి దరఖాస్తులు - auto and car drivers
ఆటో, కార్ డ్రైవర్ లకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకంపై అర్హులు పూర్తి వివరాలు తెలుసుకుని ఉండాలని నూజివీడు రవాణా శాఖ అధికారి రవి కుమార్ అవగాహన కల్పించారు.
'ఆటోవాలా ప్రోత్సాహక నగదు బహుమతి కై ఆన్లైన్లో దరఖాస్తు'