ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2020, 8:48 PM IST

Updated : Apr 30, 2020, 9:47 PM IST

ETV Bharat / state

'ఫిషింగ్​ హార్బర్లతో మత్స్యకారుల జీవితాల్లో మార్పు'

రాష్ట్రంలో మత్స్యకారుల వలసల నివారణ సహా... వారికి మరింత ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కొత్తగా ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, జెట్టీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.3 వేల కోట్లతో పలు జిల్లాల్లో 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒకచోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మించనున్నారు. మూడేళ్ల వ్యవధిలో వీటి నిర్మాణం పూర్తి చేయాలని.. చేపల వేటకు చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

'ఫిషింగ్​ హార్బర్లతో మత్స్యకారుల జీవితాల్లో మార్పు'
'ఫిషింగ్​ హార్బర్లతో మత్స్యకారుల జీవితాల్లో మార్పు'

మత్స్యాకారుల వలసలు నివారించేందుకు ఫిషింగ్​ హార్బర్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి మోపిదేవి

రాష్ట్రంలో మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా నిర్మించ తలపెట్టిన ఫిషింగ్‌ హార్బర్లపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒకచోట ఫిష్​ ల్యాండ్‌ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని సర్కారు ఆదేశాలిచ్చింది.

ఫిషింగ్​ హార్బర్లు నిర్మించే ప్రాంతాలు

శ్రీకాకుళం మంచినీళ్లపేట ఫిష్‌ ల్యాండ్‌
శ్రీకాకుళం బడగట్లపాలెం మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
విశాఖ పూడిమడక మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
తూర్పుగోదావరి ఉప్పాడ మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
పశ్చిమగోదావరి నర్సాపురం మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
కృష్ణా మచిలీపట్నం మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
గుంటూరు నిజాంపట్నం మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
ప్రకాశం కొత్తపట్నం మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
నెల్లూరు జువ్వలదిన్నె మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

మత్స్యకారులు వలస పోకూడదు...

రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మూడేళ్ల వ్యవధిలో వీటిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయన్నారు. వీటి నిర్మాణం పూర్తైతే చేపలవేట పెరగడం సహా... వాటి వల్ల ఆదాయాలు పెరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

'కరోనా ఎవరికైనా రావచ్చు.. బాధితులపై వివక్ష వద్దు'

Last Updated : Apr 30, 2020, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details