చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పక్క రాష్ట్రాలకు ప్రజలు వలసలు వెళ్లిపోయారని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అగ్ర కులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తామన్నారు కానీ.. అమలు చేయలేదన్నారు.
అన్ని వర్గాల ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారని అన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పనులు జగన్ చేసి చూపిస్తున్నారని.. ప్రజాభిమానం చూసి ఓర్వలేక తెదేపా నాయకులు సీఎంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై సీట్లు సాధించి మేయర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.