కృష్ణా బేసిన్లో 120 టీఎంసీల వరద జలాలను దోచేసి.. రాయలసీమ ప్రయోజనాలు మట్టుబెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యాయి. సీఎం జగన్ ఉత్తరాలు రాస్తున్నారే తప్ప.. రైతులు నష్టపోతున్నారని ఆలోచించటం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కృష్ణా నది జలాలను సాధించేందుకు.. కార్యాచరణ ప్రకటిస్తే రాజకీయ పార్టీలు సీఎం వెనకుండి నడుస్తామని అన్నారు.
"పక్కా రాజకీయాల కోసమే ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ఇలా చేస్తున్నారు. రాయలసీమ ప్రయోజనాలు మట్టుబెట్టడానికి కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఇద్దరూ సహకరించుకున్నారని అందరికీ తెలుసు. నీటి విషయంలో ఎందుకు కలిసి మాట్లాడుకోవట్లేదు. కృష్ణా నది జలాల వినియోగంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి" - రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి