దసరా ఉత్సవాల సందర్భంగా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసిన కారణంగా... భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం ప్రశాంతంగా సాగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు చెప్పారు. దేవి నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ప్రసాద విక్రయం, తలనీలాలు, కుంకుమార్చన ద్వారా ఇంద్రకీలాద్రిలో మెదటి రోజే రూ.36 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 10 లక్షలు అదనమన్నారు.
ప్రశాంతంగా అమ్మ దర్శనం.. ఆదాయం 10 లక్షలు అధికం
ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం సాఫీ సాగేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. మెదటి రోజే అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రాగా... గత ఏడాది కంటే ఆదాయం ఎక్కువ వచ్చిందన్నారు.
దేవి దర్శనం ప్రశాంతం..ఆదాయం 10 లక్షలు అధికం