విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులు, కార్మికులు... సమస్యలపై సమావేశమయ్యారు.విజయవాడ ఎన్జీవో హోంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కార్మికులకు జీతాల చెల్లింపు దిశగా.. ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతున్నా ..రికార్డులు దొరకడంలేదని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే 010 విధానంలో పద్దు అమలు చేయాలని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి అదే రోజే ప్రయోజనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
జీతాలు సక్రమంగా ఇవ్వాలి: మున్సిపల్ ఉద్యోగులు
విజయవాడలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జీతాలను ప్రభుత్వం సక్రమంగా చెల్లించాలని అంతా డిమాండ్ చేశారు.
A round table meeting was held under the aegis of the Municipal Workers and Employees Union in Vijayawada.