పెంపుడు పందులను ఎత్తుకుపోయారంటూ... కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్స్టేషన్లో సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పందుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్న సురేష్... ఇటీవలే పందులు అమ్మాలని సిద్ధమయ్యాడు. కానీ రాత్రికి రాత్రే... గుర్తుతెలియని వ్యక్తులు 200 పందులను ఎత్తుకెళ్లారని వాపోయాడు. వీటి విలువ సుమారు 2 లక్షల వరకూ ఉంటుందని బాధితుడు తెలిపాడు.
దొంగతనానికి కాదేది అనర్హం... పందులు మాయం..!
దొంగతనానికి కాదేది అనర్హం. ఆఖరికి పందులను కూడా చోరీ చేశారు. జీవనాధారంగా ఉన్న పందులను దొంగిలించారంటూ... బాధితుడు గన్నవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పందులు దొంగతనం చేశారని వాపోతున్న బాధితుడు