తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి ఆటోలో తరలిస్తున్న 186 మద్యం సీసాలను కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద పోలీసులు పట్టుకున్నారు. చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మద్యం బయటపడింది. మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 186 మద్యం సీసాలు స్వాధీనం - కృష్ణా జిల్లా నేర వార్తలు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో కృష్ణా జిల్లాలో కొందరు అక్రమ మద్యం సరఫరాకు తెరతీశారు. తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి తరలిస్తున్న మద్యాన్ని జొన్నలగడ్డ చెక్పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 186 మద్యం సీసాలు స్వాధీనం