KONASEEMA FLOODS: కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వరదనీరు చేరడంతో.. పంట పొలాలన్ని ముంపునకు గురయ్యాయి. గ్రామంలోని రహదారులన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. పాడి పశువులను రైతులు పొలాల నుంచి సురక్ష ప్రాంతాలకు తరలించారు. రహదారులు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో లంక పొలాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. అరటి, కంద కూరగాయల తోటలు పూర్తిగా నీటమునిగాయి.
జలదిగ్బంధంలో బడుగులవాని లంక.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
KONASEEMA FLOODS: కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయి. గ్రామాల చుట్టూ వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. రహదారులు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
KONASEEMA FLOODS