Nara Lokesh Yuvagalam Padayatra on day 213:వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయామని శెట్టి బలిజ సామాజిక వర్గీయులు లోకేశ్ వద్ద ఆవేదన వెళ్లగక్కారు. జగన్ హయాంలో బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యంగా మారాయని వాపోయారు. యువగళం పాదయాత్ర 213వ రోజు సందర్భంగా లోకేశ్ కాకినాడ జిల్లా కోరంగిలో శెట్టి బలిజలతో లోకేశ్ ముఖాముఖినిర్వహించారు. వారి సమస్యలను విన్న లోకేశ్.. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఉత్సాహంగా సాగుతున్న ‘యువగళం’ పాదయాత్ర - భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రెండు రోజులపాటు కొనసాగిన యువగళం పాదయాత్ర.. బుధవారం రాత్రి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం వద్దకు చేరుకుంది.. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో గురువారం యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.. సుంకరపాలెంలో బస చేసిన ప్రాంతం నుండి బయలుదేరిన లోకేశ్ స్థానిక రవి డిగ్రీ కాలేజీ విద్యార్థినితో ముచ్చటించారు.. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. వారితో సెల్ఫీలు దిగారు.
మల్లవరం సెంటర్లో మహిళలతో సమావేశమై బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల వివరాలు వివరించారు.. లోకేశ్ వెంట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు.. యువజన సంఘం అధ్యక్షుడు ధూళిపూడి బాబి.. మాజీ శాసనసభ్యులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.. లోకేశ్‌కు దారి పొడవునా మహిళలు, యువత, విద్యార్థులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తాళ్లరేవులో భారీ గజమాల వేసి లోకేశ్‌పై అభిమానం చాటుకున్నారు.