గుంటూరు జిల్లా కరంపూడి మండలం మిరియాల గ్రామ సచివాలయ వీఆర్వోపై వేధింపుల కేసు నమోదైంది. ఏడాదిగా తనను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నట్లు సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్న యువతి పేర్కొంది.
వేధింపులు తాళలేక శనివారం యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయంపై కుటుంబీకులు తహసీల్దార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వో వెంకటేష్‌ను పోలీసులకు అప్పగించారు. సంఘటనపై వివరాలు సేకరించి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.