Cheating in the Name of LOVE : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రేమగా మారగా.. అది సహజీవనానికి దారి తీసింది. ఇంతలో ఆ యువతికి కుటుంబ సభ్యులు వేరొకరితో పెళ్లి చేసి దుబాయి పంపించారు. మాజీ ప్రియుడి కోరిక మేరకు ఆ యువతి నగరానికి తిరిగొచ్చింది. అయితే తనతో కొన్నాళ్లు ఉండి ముఖం చాటేసి వేరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ బోరబండ రాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి(27) టెలీకాలర్‌గా పనిచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదేళ్ల క్రితం మహారాష్ట్ర జల్‌గావ్‌కు చెందిన సైఫ్(28)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌కి వచ్చిన సైఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో 2020లో యువతికి ఆమె కుటుంబ సభ్యులు వేరొక సంబంధం చూసి పెళ్లి చేసి దుబాయికి పంపారు. భర్తకు విడాకులిచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని సైఫ్ మళ్లీ మాయమాటలతో మభ్యపెట్టాడు.