ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"గర్భిణీ అని తెలిసినా.. దారుణంగా కొట్టారు" - followers

"ఇంటి ముందు గుంత తీస్తున్నారు. ఎందుకని అడిగాం. మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ.. దాడికి దిగారు. గుణపంతో తలపై బాదారు. మా తమ్ముడి భార్య ఏడో నెల గర్భిణి.. అమెని సైతం కొట్టారు. ఇళ్లు ఖాళీచేయాలని బెదిరిస్తున్నారు." - సాగర్‌బాబు, బాధితుడు

ycp-attacks-on-tdp-followers

By

Published : Jul 13, 2019, 10:55 AM IST

వైకాపా, తెదేపా మధ్య రాజకీయ ఘర్షణలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు ఎస్సీ కాలనీలో వైకాపా వర్గీయులు దాడి చేశారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు. "వైకాపాకు చెందిన గడిపూడి నీలాంబరం, అతని వర్గీయులు 10 మంది మా ఇంటి ముందు రహదారికి అడ్డంగా గుంత తీస్తున్నారు. అదేమని అడిగితే దాడికి తెగ బడ్డారు." అంటూ బాధితుడు సాగర్ బాబు వాపోయాడు.దుర్భాషలాడుతూ... గొడ్డలి, గడ్డపారతో తలపై తీవ్రంగా కొట్టారని తెలిపాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారని చెప్పాడు. 7 నెలల గర్భవతి అయిన తన తమ్ముడి భార్యపై సైతం దాడి చేశారని సాగర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.

"గర్భిణీ అని తెలిసినా.. వైకాపా వాళ్లు కొట్టారు"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details