ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

గుంటూరు జిల్లా యడ్లపాడు ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి శివ పార్వతి (29).. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

women suicide at guntur district
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

By

Published : May 22, 2021, 10:55 AM IST

గుంటూరు జిల్లాలో.. మండల కేంద్రమైన య‌డ్ల‌పాడు ఎస్టీ కాల‌నీకి చెందిన మొగిలి శివ‌పార్వ‌తి (29).. ఇంట్లో ఉరివేసుకుని శుక్ర‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాల‌నీకి చెందిన ఆదినారాయ‌ణ‌తో 10 సంవ‌త్స‌రాల‌ క్రితం శివ‌పార్వ‌తికి వివాహం జ‌రిగింది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డిన ఆమె శుక్ర‌వారం నొప్పి తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. య‌డ్ల‌పాడు ఎస్సై రాంబాబు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. ఘటనపై కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details