ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యానికి గొడుగు... అదే అయ్యింది ఆదాయ వనరు - బాపట్లలో మద్యం దుకాణాల వద్ద క్యూ

ప్రాణాలు తీసే కరోనా.. జాగ్రత్తగా ఉంచే లాక్ డౌన్.. 42 రోజుల ఇంటివాసం.. అన్నీ పోయాయి. ప్రభుత్వం మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. వారి ఆనందాన్నే వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాడు ఓ వ్యక్తి. మద్యం కొనాలంటే గొడుగులతో రావాలన్న ప్రభుత్వ నిబంధనను వ్యాపార సూత్రంగా వాడుకున్నాడు.

wine shops at baapatla in guntur district
బాపట్ల మద్యం దుకాణాల వద్ద క్యూ

By

Published : May 7, 2020, 7:05 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలో మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ప్రతి ఒక్కరి చేతిలో గొడుగు. అది లేకపోతే మందు దొరకదు కదా మరి. గొడుగు, మాస్కు లేని పక్షంలో మందు దొరకని పరిస్థితుల్లో అందరూ గొడుగులు తెచ్చుకుంటున్నారు. మరి ఛత్రం మరిచిపోయి వచ్చిన వారి పరిస్థితి ఏంటి. అది గమనించిన ఓ వ్యక్తి దాన్ని ఆదాయం తీసుకువచ్చే వ్యాపారంలా మలిచాడు.

బాపట్ల కూరగాయల మార్కెట్ వద్దనున్న మద్యం దుకాణం సమీపంలో గొడుగులు అద్దెకిచ్చే పనికి శ్రీకారం చుట్టాడు. ఒక గొడుగుకి రూ. 100 అడ్వాన్స్, రూ. 20 ల చొప్పున వసూలు చేస్తున్నాడు. మందు కొనుక్కుని తిరిగి వెళ్లేటప్పుడు ఆ రూ.100 వారికి ఇచ్చేస్తాడు. భలే ఉంది కదా అతని గొడుగు ఆలోచన.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details