Villagers protest : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకం. చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రజలు కొన్ని చోట్ల మద్యం అమ్మకం నిషేధించాలంటూ ధర్నాలు చేస్తుంటారు. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో మద్యం దుకాణం తరలించవద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
వైన్ షాప్ తరలిస్తే ఊరుకోం.. ధర్నాకు దిగిన గ్రామస్థులు
Villagers protest on wine shop transfer: మద్యం మత్తులో ఎంతో మంది ఆర్థికంగా చిత్తవుతున్నారు. సాధారణంగా తమ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను నిలిపేయాలంటూ ధర్నాలు చేయడం చూస్తుంటాం. కానీ తెలంగాణలోని ఓ గ్రామంలో మాత్రం విచిత్రంగా మద్యం దుకాణాన్ని తరలించవద్దంటూ ఆందోళనకు దిగారు.
వైన్ షాప్ తరలిస్తే ఊరుకోం
మద్యం దుకాణం యామనపల్లి గ్రామానికి మార్చడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. దుకాణం బలవంతంగా తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో చిరు వ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: