రైతులు చనిపోతే స్పందన లేదు
రాజధాని తరలిపోతోందనే ఆందోళనతో ఇప్పటికే 8 మంది చనిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందని.. ప్రశ్నించారు. న్యాయం అడిగితే జైళ్లల్లో పెడుతున్నారన్న వారు... అన్నదాతలను అరెస్టులు చేయమని ఏ చట్టం చెప్పిందని నిలదీశారు. ఓ ఎమ్మెల్యే కారుపై దాడి జరిగితే వైకాపా నేతలంతా... హడావుడి చేస్తున్నారే... 27 వేల మంది రోడ్లపై నిరసన చేస్తుంటే... ఒక్క ఎమ్మెల్యే సైతం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.