గుంటూరు జిల్లా బాపట్లలో ఆలయాలు ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక తెదేపా నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ అన్నారు. తెదేపా పట్టణాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి విన్నకోట వీరయ్యనాయుడు, ఉపాధ్యక్షుడు రూచిపూడి శ్యామ్ సుందరకు ఎలాంటి నేర చరిత్ర లేవన్నారు.
'అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం' - బాపట్ల వార్తలు
బాపట్లలో ఆలయాలు ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక తెదేపా నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ తెలిపారు.
ఆలయాలు, ప్రార్థనా మందిరాలుపై ఏదైనా జరిగితే ముగ్గురు నేతలదే బాధ్యత అంటూ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. అక్రమ కేసుల విషయంపై న్యాయనిపుణులతో చర్చించి... హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఉప సభాపతి కోన రఘుపతి ఈ దారుణంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, సీనియర్ నేత సలగల రాజశేఖరబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వైకాపాను భాజపాలో విలీనం చేయడం మంచిది : శైలజానాథ్