కరోనా నేపథ్యంలో సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ కాటన్ అసోసియేషన్ 5 లక్షలు, జపాన్ తెలుగు సమాఖ్య 4 లక్షల 30 వేలు అందజేశాయి. నాగేంద్రారెడ్డి, సూరారెడ్డి అనే వ్యక్తులు 4 లక్షలు 30 వేలు విరాళామిచ్చారు. వాటికి సంబంధించిన చెక్కులను హోంమంత్రి సుచరితకు అందజేశారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ.. విరాళామిచ్చిన వారికి హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ.. 13 లక్షలు ఇచ్చిన వివిధ సంస్థలు - సీఎంఆర్ఎఫ్కు ఏపీ కాటన్ అసోసియేషన్ విరాళం
కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వానికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలిస్తున్నారు. నేడు వివిధ సంస్థలు 13 లక్షల 60 వేల రూపాయలు విరాళామిచ్చాయి. సదరు చెక్కులను హోంమంత్రి సుచరితకు అందించారు.
సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇచ్చిన దాతలు