ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో కొలువుల జాతర.. 2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - TSPSC LATES NEWS

TSPSC NOTIFICATIONS: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా తెలిపారు. టీఎస్‌పీఎస్సీ, గురుకుల విద్యాలయాల నియామక సంస్థ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 2022 సంవత్సరంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ.. వచ్చింది. ఇప్పుడు 2023లో ఉద్యోగ నోటిఫికేషన్ మరోసారి వేసింది.

TSPSC NOTIFICATIONS
TSPSC NOTIFICATIONS

By

Published : Jan 27, 2023, 9:07 PM IST

TSPSC NOTIFICATIONS: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా తెలిపారు. టీఎస్‌పీఎస్సీ, గురుకుల విద్యాలయాల నియామక సంస్థ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి, ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ గురుకులాల్లో 153 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వగా.. 417 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు.

గురుకులాల్లో 87 టీజీటీ పోస్టుల భర్తీ, సమాచార పౌరసంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీ, బీసీ గురుకులాల్లో 1,499 పోస్టుల భర్తీ, 480 డిగ్రీ కళాశాల లెక్చరర్‌ పోస్టుల భర్తీ, 185 జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టుల భర్తీ, 235 పీజీటీ, 324 టీజీటీ, బీసీ గురుకులాల్లో 63 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ.. ఉత్తర్వూలు జారీ చేశారు. ఇప్పటికే 2022 సంవత్సరంలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ.. వచ్చింది. ఇప్పుడు 2023లో ఉద్యోగ నోటిఫికేషన్ మరోసారి వేసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details