మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షో రూమ్ వ్యాపార అనుమతిని రవాణా శాఖ రద్దు చేసింది. ఈనెల 2న గౌతమ్ ఆటోమోటివ్ షో రూమ్‌ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. 2008-19 ఆర్థిక సంవత్సరంతోపాటు.. ఈ ఏడాది ఆగస్టు 2వరకు జరిపిన విక్రయాలను పరిశీలించారు.
కోడెల కుమారుడి షోరూమ్ అనుమతి రద్దు - ap latest
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూమ్ వ్యాపార అనుమతిని రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ వెల్లడించారు.
ఈ సోదాల్లో 1025 వాహనాలు లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పన్ను లేకుండానే అమ్మకాలు చేశారని గుర్తించారు. షోరూమ్ సీజ్ చేశారు. ఈ విషయమై నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. 576 వాహనాలకు సంబంధించి రూ. 40.26 లక్షల పన్ను చెల్లిస్తామని హైకోర్టుకు విన్నవించారు. ఈ బకాయిలు చెల్లించిన తర్వాత షోరూమ్ తాళాలు తీయవలసిందిగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఏపీ మోటారు వాహనాల చట్టం ప్రకారం షో రూమ్ వ్యాపార అనుమతిని రద్దు చేశామని డీటీసీ మీరా ప్రసాద్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..ఫర్నిచర్ రగడ...హైకోర్టులో కోడెల పిటిషన్ విచారణ