గుంటూరులో తుపాకీ కలకలం సృష్టించింది. గుజ్జనగుండ్ల ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం అరుగుపై ఉన్న తుపాకీని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేశవాళీ రకానికి చెందిన ఎయిర్ తుపాకీగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ తుపాకీని తెచ్చింది శ్రీకాంత్ అనే వ్యక్తిగా పోలీసులు భావించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తుపాకీని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.
తుపాకీ కలకలం... పోలీసుల అదుపులో అనుమానితుడు - gujjanagundla
గుంటూరు గుజ్జనగుండ్లలోని ఆంజనేయ ఆలయం అరుగుపై తుపాకీ దొరికింది. స్థానికుల సమాచారంతో తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తిపై అనుమానంతో..అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తుపాకీ కలకలం... పోలీసుల అదుపులో అనుమానితుడు