ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సిమెంటు ఫ్యాక్టరీతో ప్రాణాలకు ముప్పు..'

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు సమీపంలోని చెట్టినాడ్‌ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము వలన పొలాలు నాశనం అవుతున్నాయని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దిగుబడి వచ్చే పొలాలు ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము వల్ల పాడవుతున్నాయని.. రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారని తెలిపారు.

Threat to life with cement factory in Thakkellapadam
సిమెంటు ఫ్యాక్టరీతో ప్రాణాలకు ముప్పు.. దుమ్ముతో పంటలు నాశనం

By

Published : Mar 4, 2021, 1:08 PM IST

పరిశ్రమలు నడపటం కోసం రైతులు ప్రాణాలు తీసుకోవాలా? వారి పొలాలు బీళ్లుగా మార్చాలా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు సమీపంలోని చెట్టినాడ్‌ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము వలన పొలాలు నాశనం అవుతున్నాయని.. రైతులు పెద్ద ఎత్తున చెబుతున్నారన్నారు. మార్చి 16 వరకు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని.. పొలాలు ఇచ్చిన రైతులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. పరిసర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ముగిసిన పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు

ABOUT THE AUTHOR

...view details