గుంటూరు జిల్లా ఫిరంగిపురం దుర్గా నగర్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఇంట్లో చోరి జరిగింది. పనుల నిమిత్తం బయటకి వెళ్లివచ్చిన వెంకటేశ్వరరావుకు ఇంట్లో బీరువా తెరిచి కనిపించింది. అందులో రూ.50 వేల నగదు, రెండు బంగారపు ఉంగరాలు, చెవి దుద్దులు మాయమయ్యాయి. చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బాధితుడి మేనత్త బుజ్జి చోరికి పాల్పడినట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండుకి పంపించినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
అల్లుడు ఇంట్లో మేనత్త చోరీ.. అరెస్ట్
సొంత మేనత్తే.. అల్లుడి ఇంట్లో చోరీకి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ.50 వేలు, బంగారం దొంగిలించింది. డబ్బు కనిపించకపోవడంతో ఇంట్లో దొంగలు పడ్డారని భావించిన మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనత్తే అసలు దొంగని పోలీసుల విచారణలో తేలింది.
thief arrest
TAGGED:
ఫిరంగీపురంలో చోరీ వార్తలు