ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీజీ విగ్రహానికి..17 ఏళ్లుగా నిత్య పూజలు

ప్రపంచానికి శాంతి మార్గం చూపిన మహాత్ముడి విగ్రహానికి తెనాలిలో నిత్యం పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా బాపూజీ స్ఫూర్తితో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు సేవ చేస్తున్నారు.

గాంధీ

By

Published : Oct 2, 2019, 5:55 PM IST

గాంధీజీ విగ్రహానికి నిత్య పూజలు

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి వచ్చి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు మహాత్ముడు. ఇప్పుడు అదే పట్ణణంలోని కొత్తపేటలో గాంధీజీ విగ్రహానికి నిత్య పూజలు జరుగుతున్నాయి. బాపూజీకి వీరాభిమాని అయిన వజ్రాల రామలింగాచారి అనే వ్యక్తి మహాత్మాగాంధీ పేరిట 2002లో శాంతి పీఠాన్ని ప్రారంభించారు. దీని ద్వారా జాతిపిత బోధనలను ప్రచారం చేస్తున్నారు. అప్పటినుంచే మహాత్ముడి విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా 2004లో శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ఏర్పాటు చేశారు. కొంతమంది వృద్ధులను చేరదీసి వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడుచుకుంటూ సాటి వారికి సాయపడాలని మహాత్మాగాంధీ ఆశ్రమం నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. మానవసేవ చేసిన మహనీయుడిని దేవునిగా భావించి పూజలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details