ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 13, 2020, 10:18 PM IST

ETV Bharat / state

మాచర్ల పురపాలిక వైకాపాకు ఏకగ్రీవమయ్యే అవకాశం..!

గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘానికి నామినేషన్ల ప్రక్రియలో హైడ్రామా నెలకొంది. వైకాపా మినహా వేరే పార్టీల వారు నామినేషన్ వేసేందుకు ముందుకు రాకపోవడం వల్ల ఇక్కడ ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో తెదేపా వాళ్లమంటూ ఐదుగురు నామినేషన్లు వేసినా.. వారి ధ్రువపత్రాలు సరిగా లేవు.

The possibility of being unanimous elected ycp in macharla muncipal
మాచర్ల తెదేపా ఇంఛార్జ్ చలమారెడ్డి

మాచర్ల పురపాలిక వైకాపాకు ఏకగ్రీవమయ్యే అవకాశం..!

గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘం వైకాపాకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురపాలికలోని 31 వార్డుల్లోనూ వైకాపాకు సంబందించిన అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. మూడు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నా... ప్రతిపక్ష తెదేపా, జనసేన, భాజపాల నుంచి ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. కనీసం స్వతంత్రులు కూడా పోటీ చేయటం లేదు. అయితే నామినేషన్ల ప్రక్రియ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా... తెదేపా అభ్యర్థులమంటూ ఐదుగురు నామినేషన్లు వేశారు. వారు కేవలం నామపత్రాలు మాత్రమే అధికారులకు అందజేశారు. నామపత్రాలతో పాటు జతచేయాల్సిన నగదు డిపాజిట్, ఎన్​వోసీ, తెదేపా బీఫాం ఏవీ లేవు. తెదేపా నేతలు వారితో వ్యూహాత్మకంగా నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది.

మాచర్లలో వైకాపా నేతల సందడి

పురపాలక సంఘం కార్యాలయం వద్ద వైకాపా అభ్యర్థుల సందడి నెలకొంది. నియోజకవర్గంలోని 71 స్థానాల్లో 66 చోట్ల కేవలం వైకాపా అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే పోటీ ఉంది. మున్సిపాలిటీలో కనీసం ఒక్కచోట కూడా పోటీ లేకపోవటం అధికార పార్టీ బెదిరింపులకు నిదర్శనంగా తెదేపా నేతలు చెబుతున్నారు. నామినేషన్ వేసేందుకు సిద్ధపడిన వారిని బెదిరిస్తున్నారని.. పోలీసు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో... ఎవరూ నామినేషన్ వేయటానికి ముందుకు రాలేదని మాచర్ల తెదేపా ఇంఛార్జీ చలమారెడ్డి ఆరోపించారు.

ఇవీ చదవండి:

డోన్​లో మున్సిపల్​ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: కేఈ కృష్ణమూర్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details