పురపాలక పాఠశాల ప్రైవేటు వ్యక్తులకు అడ్డాగా మారింది. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రహదారిలో 21వ వార్డులో మీ సేవా కేంద్రం వద్ద ఆంజనేయ అగ్రహారం పురపాలక ప్రాథమిక పాఠశాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు స్టోర్ రూమ్‌లుగా మార్చేేసి వాడుకుంటున్నారు. సమీపంలో నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనం కోసం తెచ్చిన ఇనుప కడ్డీలు, దర్వాజాలు తెచ్చి పాఠశాలలో ఉంచారు.
ప్రైవేటు వ్యక్తుల అడ్డాగా పురపాలక పాఠశాల - బాపట్ల వార్తలు
గుంటూరు జిల్లా బాపట్లలోని పురపాలక పాఠశాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు అడ్డాగా మార్చుకున్నారు. భవన నిర్మాణ సామగ్రిని, కార్మికులను పాఠశాలలోని గదుల్లో ఉంచారు.
బాపట్ల పురపాలికలోని పాఠశాల
ఓ గుత్తేదారు తన పనులకు సంబంధించిన కార్మికులను సైతం ఇదే పాఠశాలలో ఉంచారు. దీనిపై పురపాలిక కమిషనర్ భానుప్రతాప్ను ప్రశ్నించగా... పాఠశాలలో ఉంచిన ప్రైవేటు వ్యక్తుల భవన నిర్మాణ సామగ్రిని ఖాళీ చేయిస్తామని తెలియజేశారు.
ఇదీ చదవండి:క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్