ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kidnap: నా భార్యను కిడ్నాప్​ చేశారు.. న్యాయం చేయండి..

By

Published : Jul 16, 2021, 4:47 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పెళ్లిని అంగీకరించని.. భార్య తరఫు కుటుంబ సభ్యులే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

kidnap
kidnap

గుంటూరు జిల్లా(guntur district) బొల్లాపల్లి మండలంలో సినీఫక్కీలో ఓ కిడ్నాప్ (Kidnap)​ జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె తండ్రి తరఫు బంధువులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని బాధితుడు నల్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను కిడ్నాప్(Kidnap)​ చేసిన వారిని వెంటనే శిక్షించి.. తనకు న్యాయం చేయాలని యువకుడు... పోలీసులను కోరాడు .

ప్రేమ వివాహం..

పెరూరుపాడు గ్రామానికి చెందిన కాట్ల విజయలక్ష్మి అనే యువతిని.. అదే గ్రామానికి బొప్పుడి శ్రీనివాసరావు ప్రేమించాడు. వారి ప్రేమ విషయాన్ని ఇరువురు ఇంట్లో తెలియజేశారు. పెద్దలను ఒప్పించటానికి ప్రయత్నించారు. కానీ పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు. చేసేదేమీ లేక పెద్దలను ఎదురించి మే 6వ తేదీన ప్రేమ వివాహం(love marriage) చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుంటుంబ సభ్యులు వారితో ఘర్షణకు దిగారు. ఈ వివాదం కాస్త పెరిగి పోలీసుల చెంతకు చేరింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురి కుటుంబాలతో మాట్లాడి.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

నా భార్యను కిడ్నాప్​ చేశారు.. న్యాయం చేయండి..

అంతా ముగిసిందనుకున్నారు. కానీ...

అక్కడితో అంతా ముగిసిందని భావించారు ఆ యువ జంట. గుంటూరు జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్(engineering) కళాశాలలో విజయలక్ష్మీ.. చివరి సంవత్సరం చదువుతోంది. పరీక్షల నిమిత్తం 12వ తేదీన గుంటురులోని కశాళాలకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను ఆఫీస్ రూమ్​కి పిలిచి.. ఆమె తండ్రి సోదరుడు బెదిరించారని శ్రీనివాసరావు తెలిపారు. కానీ తన భార్య భయపడలేదన్నారు. అనంతరం 15వ తేదీన పరీక్ష రాసి వస్తున్న తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని శ్రీనివాసరావు తెలిపాడు. ఆ సమయంతో తన వెంట ఉన్న తన సోదరుడిపై సైతం దాడి చేశారని వాపోయాడు. ఈ ఘటనపై కళాశాల పరిధిలోని నల్లపాడు పోలీసులకు(nallapadu police station) ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తన భార్య తరఫు కుటుంబ సభ్యులే కిడ్నాపు చేసి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య ఆచూకీ కనుగొని.. న్యాయం చేయాలని పోలీసులను శ్రీనివాసరావు కోరాడు. కేసు నమోదు చేసుకున్న నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

ఉద్యోగినికి వేధింపులు... 'దిశ'ను ఆశ్రయించిన బాధితురాలు

MURDER CASE: తండ్రిని హత్య చేసిన కుమారుడు..వివాహేతర సంబంధమే..!

Accident: విజయనగరంలో ప్రైవేటు బస్సు బోల్తా.. 14 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details