యూ1 రిజర్వ్‌జోన్ ఎత్తివేతకు ఆందోళన - FARMERS DHARNA
గుంటూరు జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన యూ1 రిజర్వ్‌జోన్‌ను ఎత్తివేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి వస్తున్న వీరిని పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కొలనుకొండ, కుంచనపల్లిలో సుమారు 178 ఎకరాలను ప్రభుత్వం తాడేపల్లిలో U1 రిజర్వ్‌జోన్‌గా ప్రకటించింది. ఈ జోన్‌ను ఎత్తివేయాలని రైతులు గత సోమవారం ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించారు. వారం గడిచినా ఎలాంటి చర్యలు చేపట్ట లేదనిమరోసారి ఆందోళనబాట పట్టారు. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి వస్తున్న రైతులను పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు. ఇది రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదానికి దారితీసింది.