Yanamala Rama Krishnudu Challenge to Jagan: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతప్రతం విడుదల చేసే ధైర్యం జగన్‌కు ఉందా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. ఆర్థిక శాఖలో ఏం జరుగుతుంతో మంత్రి బుగ్గనకు తెలుసా అని ఎద్దేవా చేశారు. ఆర్థిక శాఖపై పెత్తనమంతా సీఎందే అని విమర్శించారు. ఆర్థికశాఖపై ఏ మాత్రం అవగాహన ఉన్నా జగన్ తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఆర్థికశాఖలో ఏం జరుగుతుందో మంత్రి బుగ్గనకు తెలుసా..!: యనమల
Yanamala Rama Krishnudu Challenge to Jagan: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో మంత్రి బుగ్గనకు తెలియదని.. పెత్తనమంతా జగన్‌దే అని విమర్శించారు.
బహిరంగ మార్కెట్ ద్వారా తెచ్చిన అప్పు ఎంత? కట్టిన వడ్డీ ఎంత చెప్పాలని డిమాండ్ చేశారు. పీడీ అకౌంట్లో నిధులు ఎంత వాడారు? పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయో సీఎం సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది? ఎన్ని కోట్లు దారి మళ్లించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర వృద్ధి రేటు, తలసరి ఆదాయం ఎంతో బయట పెట్టాలని సవాల్ చేశారు. సీఎంతో చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా తాను సిద్ధమని ప్రకటించారు.
ఇవీ చదవండి: