ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు న్యాయం చేయలేని జగన్​కు అధికారంలో ఉండే అర్హత లేదు: కొనకళ్ల నారాయణ రావు

Konakalla Narayana Rao: ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతుంటే వైకాపా ప్రభుత్వానికి పట్టించుకునే యోచన లేదని తెదేపా ఉపాధ్యక్షులు కొనకళ్ల నారాయణ రావు ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు.

Konakalla Narayana Rao
కొనకళ్ల నారాయణ రావు

By

Published : Nov 2, 2022, 7:23 PM IST

Konakalla Narayana Rao: రైతులకు న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డికి.. అధికారంలో ఉండే అర్హత లేదని తెదేపా ఉపాధ్యక్షులు కొనకళ్ల నారాయణ రావు ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు ధాన్యం బకాయిలు 15 రోజుల్లో చెల్లించామని.. నేడు నెలలు గడుస్తున్నా వైకాపా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల రైతులు కాడి కింద పడేస్తున్నారని ఆక్షేపించారు.

రైతు భరోసా కింద బటన్ నొక్కగానే రైతుల అకౌంట్లలో నగదు జమ అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని.., ఇప్పటికీ 77వేల మంది రైతులకు రైతు భరోసా నగదు జమ కాలేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతుంటే.. వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానం,.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలనలో 5వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details