TDP Sympathizers Votes Removing in Guntur :ఓటర్ జాబితాల్లో అవకతవకలు, అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫారం-7 (Form-7) దరఖాస్తుల ద్వారా విపక్షాల ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నా ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది.
Irregularities in AP Voter List :వైఎస్సార్సీపీ ఓటర్లు మరణించినా జాబితాలో వారి పేర్లు కొనసాగిస్తున్న అధికారులు, తమ వారి ఓట్లను మాత్రం తొలగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒక సామాజిక వర్గం ఓట్లు తొలగించడానికి వైఎస్సార్సీపీ నేతలు వందలాది ఫారం-7 దరఖాస్తులు చేశారు. మూడు రోజుల్లోనే ఒక్కో పోలింగ్‌బూత్ పరిధిలో వందల దరఖాస్తులు వచ్చాయి. గంపగుత్తగా అయిదుగురు ఫారం-7 దరఖాస్తులు చేశారని, వారంతా వైఎస్సార్సీపీ నాయకులుగా గుర్తించామని తెలుగుదేశం నేతలు తెలిపారు.
Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!
Fake Votes in Andhra Pradesh :ఆధారాలు లేకుండా ఫారం-7 దరఖాస్తులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు లేదా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకుంటామన ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. బతికున్న వారి ఓట్లు తొలగించాలని దరఖాస్తు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు.