ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌ను నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెదేపా కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, గుంటూరు జిల్లా పార్లమెంటరీ మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వంగలపూడి అనిత అన్నారు. పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తెదేపా నిరసన - ఎమ్మెల్సీ బీటెక్ రవి వార్తలు
గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌ను నిరసిస్తూ ర్యాలీ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇకనైన పాలనపై దృష్టి సారించాలని సూచించారు.
తెదేపా నేతలు నిరసన