పోలీసు వాహనంలో ఎక్కి అమరావతి నినాదాలు చేస్తే.. కేసు పెట్టి రిమాండ్‌కు పంపిస్తానంటూ.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్సై అశోక్ తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు బంద్ నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు మూసివేయాలని.. బంద్‌కు సహకరించాలని నాయకులు కోరారు. ఆ సమయంలో నాయకుల వద్దకు వచ్చిన ఎస్సై అశోక్... వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలను అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. వాహనంలో కూర్చున్నవారు జై అమరావతి అంటూ నినాదాలు చేయడంపై ఎస్సై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టి రిమాండ్‌కి పంపిస్తానంటూ బెదిరించారు.
'కేసు పెట్టి రిమాండ్‌కు పంపిస్తా'.. తెదేపా నేతలకు ఎస్సై వార్నింగ్
పోలీసు వాహనంలో ఎక్కి అమరావతి నినాదాలు చేస్తే.. కేసు పెట్టి రిమాండ్‌కు పంపిస్తానంటూ.. ప్రత్తిపాడు ఎస్సై అశోక్ తెదేపా నేతలను బెదిరించారు.
ప్రత్తిపాడులో తెదేపా నేతల అరెస్ట్