గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలోని మసీదు పక్కనున్న చెత్తకుప్పలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో చెత్త సుమారు 20 మీటర్ల ఎత్తులో ఎగిరిపడింది. బాంబు పేలిన పెద్ద శబ్దంతో రావడం వలన గ్రామస్థులు ఆందోళన చెందారు. అయితే ఈ పేలుడులో ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వలన గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చెత్త కుప్పలో డబ్బాలలో గ్యాస్ ఉండడం వలన పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విషయాన్ని నిర్ధరించేందుకు పోలీసులు గుంటూరు నుంచి బాంబు స్క్వాడ్‌ని పిలిపించారు. పేలుడు జరిగిన ప్రదేశంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. చెత్త కుప్పలో ఉన్న డబ్బాలలో గ్యాస్ ఉండటం వలన పెద్ద శబ్దం తో పేలి ఉండవచ్చునని తనిఖీల అనంతరం చిలకలూరిపేట గ్రామీణ సీ.ఐ సుబ్బారావు తెలిపారు. అంతేగాని ఎలాంటి బాంబులు లేవని.. ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
చెత్త కుప్పలో భారీ పేలుడు.. బాంబు స్క్వాడ్ పరిశీలన - dumping yard
గుంటూరు జిల్లా వంకాయలపాడు గ్రామంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. గ్రామంలోని చెత్త కుప్పలో ఉన్న డబ్బాలలో గ్యాస్ ఉండడం వలన పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవాల నిర్ధరణకు గుంటూరు నుంచి బాంబు స్క్వాడ్‌ని పిలిపించి పరిశీలించారు.
చెత్త కుప్పలో భారీ పేలుడు.. బాంబు స్క్వాడ్ పరిశీలన
Last Updated : Aug 14, 2019, 11:21 PM IST