విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరులో ఎస్ఎఫ్ఐ , ఏఎస్ఎఫ్ఐ , పీడీఎస్యూ సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బోధన రుసుం , బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏ.ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శి మహంకాళి డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని కోరారు. జిల్లాలోని పలు మున్సిపల్ పాఠశాలలు మూసివేసి బంద్ కు మద్దతు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరులో విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో బంద్ - Students banded
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలోవిద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Students banded under the auspices of student groups across the state