ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జై అమరావతి అన్నందుకు నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి సంఘాల ఐకాస నేతలు విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. విద్యార్థులను సస్పెండ్ చేసిన ఉపకలపతి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మద్దతుగా తెదేపా నేతలు నిరసనలో పాల్గొని...సంఘీభావం తెలిపారు. వైకాపాకు కొమ్ముకాస్తున్న ఉపకులపతి వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నాయకులు తెలిపారు.
'ఏఎన్యూ ఉపకులపతి రాజీనామా చేయాలి' - నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థుల సస్పెన్షన్ తాజా వార్తలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి వెంటనే రాజీనామా చేయాలని.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నలుగురు విద్యార్థులను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఏఎన్యూ ఎదుట ఆందోళన నిర్వహించాయి.
నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా