ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హడలెత్తిస్తున్న కుక్కలు - నిద్రమత్తు వీడని అధికారులు

Stray Dogs Attacked on Boy In Guntur: గుంటూరు నగరంలో వీధికుక్కల బెడద పెరిగిపోయింది. నగర వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ, పిల్లలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ వీధికుక్కలను కట్టడి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 12:48 PM IST

Stray Dogs Attacked on Boy In Guntur
Stray Dogs Attacked on Boy In Guntur

Stray Dogs Attacked on Boy In Guntur:గుంటూరు నగరంలో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. పిల్లలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం సంపత్ నగర్లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. శునకాల స్వైరవిహారంపై అధికారులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గుంటూరులోని సంపత్ నగర్లో డిసెంబర్ 30న జరిగిన ఈ ఘటన నగరవాసుల్ని తీవ్ర భయాందోళనలకుగురి చేసింది. సమయానికి ఓ వాహనదారుడు స్పందించి కుక్కల్ని తరిమేయటంతో బాలుడు గాయాలతో బయటపడ్డాడు.

హడావిడిగా ప్రత్యేక డ్రైవ్: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. అది వైరల్‌ కావడంతో నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వీధి కుక్కల్ని(Street dogs) పట్టుకున్నారు. వీటిని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం (Animal Birth Control Center)ఏబీసికి తరలించారు. వీధి కుక్కల సమస్య నగరం మొత్తం ఉండగా, ఘటన జరిగిన సంపత్ నగర్ ప్రాంతంలోనే హడావిడి చేసి మిగతా ప్రాంతాలను వదిలేశారు. సంపత్ నగర్ తో పాటు చుట్టుగుంట, కొరిటపాడు, శ్యామలానగర్, అరండల్ పేట, బ్రాడిపేట, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. కుక్కల్ని పట్టుకుని కొంత కాలం ఏబీసీలో ఉంచి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


నాలుగేళ్ల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి.. భుజం, చేతులపై కాట్లు.. బెదిరించినా వదలకుండా..

'వీధికుక్కల సమస్యలపై స్పందన, వాట్సాప్, జీఎంసీ (guntur municipal corporation ) ఫిర్యాదుల విభాగం 103కి పిర్యాదులు వస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఏటుకూరు రోడ్డులో యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ (Animal Birth Control Center) శస్త్రచికిత్సలు చేసేందుకు షెడ్లు నిర్మించారు. కుక్కలకు శస్త్రచికిత్సలు చేసి వాక్సినేషన్ చేశారు. ఆ ప్రక్రియలో ఆక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలతో నిలిపివేశారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు పశుసంవర్ధక శాఖ ముందుకొచ్చింది. ఐతే వైద్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవం, శస్త్ర చికిత్సలకయ్యే ఖర్చులు ఇవ్వక దానిని నిలిపివేశారు. రెండేళ్ల క్రితం 15 వేల వరకు వీధి కుక్కలు ఉండగా, శస్త్రచికిత్సలు ఆగిన తర్వాత వీటి సంఖ్య 25 వేలకు చేరిందని అంచనా.-'శివరామిరెడ్డి, అవగాహనా సంస్థ కార్యదర్శి

ఏబీసీ కేంద్రం నిర్వహణ: వీధికుక్కల సమస్యలపై పలు మార్లు తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రశ్నలు సంధించారు. ప్రజారోగ్య అధికారులు అప్పటికప్పుడు వివరణ ఇవ్వడమేగానీ తర్వాత శస్త్రచికిత్సలు, ఏబీసీ కేంద్రం నిర్వహణ గురించి పూర్తిగా గాలికొదిలేశారు. వీధికుక్కలను ఇష్టానుసారం పట్టుకుని గాయాల పాల్చేస్తున్నారని కొందరు జంతు ప్రేమికులు న్యాయస్థానాల్లో కేసులు పెడుతున్నారు. కోర్టులో కేసు సాకుతో కుక్కలు పట్టుకోవడాన్ని నిలిపివేశారు.

రూ.20 కోట్ల శునకం హైదరాబాద్​లో హల్​చల్​ - చూసేందుకు ఎగబడిన జనం

ABOUT THE AUTHOR

...view details