"రేపల్లె రైల్వే స్టేషన్లో రూ. 3 కోట్లతో అభివృద్ది పనులు" - rail way station
గుంటూరు జిల్లాలోని రైల్వే స్టేషన్లలోని అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే సంప్రదింపుల కమిటీ సభ్యుడు శశిధర్ పర్యవేక్షించారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
జిల్లాలో గుంటూరు తరువాత రేపల్లె స్టేషన్ నుంచే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే సంప్రదింపుల కమీటీ సభ్యుడు శశిధర్ తెలిపారు. తెనాలి నుంచి రేపల్లె వరకు ఉన్న అన్ని స్టేషన్లను ఆయన పరిశీలించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో జరుగుతున్న రెండో ఫ్లాట్ఫామ్ పనులను ఆయన పర్యవేక్షించారు. రేపల్లె రైల్వే స్టేషన్లో సుమారు 3 కోట్ల రూపాటల వ్యయంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండో రైల్వే లైన్ పనులు పూర్తి కావస్తున్నాయని... డెమో ట్రైన్స్ ఆగేందుకు లూప్ లైన్తో పాటు.. ట్రాక్ మిషన్ సైడింగ్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. జంపని, పెనమర్రు స్టేషన్లకు సుమారు కోటి 70 లక్షల రూపాయలతో హైలెవల్ ఫ్లాట్ఫామ్ నిర్మాణం చేస్తూన్నామన్నారు. భట్టిప్రోలు రైల్వే స్టేషన్కు 80 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు శశిధర్ తెలిపారు. తెనాలి నుంచి రేపల్లె వరకు నీటి సమస్యపై ప్రయాణికుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిష్కారిస్తామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శశిధర్ తెలిపారు.