ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పు చేసింది.. సరిదిద్దుకో అన్నందుకు కొడుకునే కడతేర్చింది - guntur latest news forson murder by his mother

కొడుకు తప్పు చేస్తే తల్లి మందలించడం సహజం. కానీ అమ్మే తప్పు చేస్తే ఏం చేయాలి. ఇదే పరిస్థితి ఓ కుమారుడికి ఎదురైంది. తప్పు చేయొద్దని తల్లిని మందలించాడు. కానీ అదే అతని ప్రాణాలు పోయేలా చేస్తుందని ఊహించలేదు. వివాహేతర సంబంధం ముందు కన్నప్రేమను మరిచి ప్రియుడితో కొడుకునే కడతేర్చింది ఓ తల్లి.

son murder by his mother due to illegal affair in guntur
అక్రమ సంబంధం మానేయాలన్న కొడుకుని చంపించిన తల్లి

By

Published : Dec 29, 2019, 10:22 PM IST

అక్రమ సంబంధం మానేయాలన్న కొడుకుని చంపించిన తల్లి

అక్రమ సంబంధం మానేయాలన్న కుమారుడిని కన్నతల్లి ప్రియుడి సాయంతో అంతమొందించింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగుకు చెందిన రాణికి సత్యనారాయణతో వివాహమైంది. కొద్ది రోజులకే రాణికి బాలస్వామితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత 20 ఏళ్లుగా వీరిద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రాణి కుమారుడు హార్దిక్​ రాయి వివాహేతర సంబంధానికి దూరంగా ఉండాలని తల్లిని హెచ్చరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న తల్లి... ప్రియుడు బాలస్వామితో కలిసి కొడుకుని చంపటానికి పథకం వేసింది. గత నెల 19వ తారీఖున బాలస్వామి.... హార్దిక్​ని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని పొలానికి తీసుకెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న తాడుతో హార్ధిక్ రాయ్ మెడకు ఉరివేసి.. గట్టిగా బిగించడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని మంగళగిరి మండలం గుంటూరు కాలవ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు​ తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details