ఆ కమిటీకి చట్టబద్ధత ఏదీ..?
రైతుల ఆందోళనలతో మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీసీజీ నివేదిక వచ్చే వరకూ వేచి చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బీసీజీ కమిటీని గుర్తించబోమన్న రాజధాని ప్రాంత రైతులు ఆ కమిటీని ఎప్పుడు నియమించారు.. దానికి ఉండే చట్టబద్ధత ఏంటి... అది సైతం జీఎన్ రావు కమిటీ వంటిదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
నేటి ఆందోళనలివే..
రాజధాని గ్రామాల్లో ఇవాళ సైతం ఆందోళనలు కొనసాగనున్నాయి. తుళ్లూరులో మహాధర్నాతో పాటు వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు.. అలాగే మందడంలో మహాధర్నా, రాజధాని పరిధిలోని ఇతర గ్రామాల్లో నిరసనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు. ఇక గుంటూరులో బంద్ జరగాల్సి ఉన్నా... మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం రాని కారణంగా దాన్ని వాయిదా వేశారు. సోమవారం నుంచి గుంటూరులో రిలే దీక్షలు చేస్తామని అన్నదాతలు తెలిపారు.
పోలీసుల ఆంక్షలు
రాజధాని గ్రామాల్లో ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అన్నదాతలు ప్రస్తుతం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. కొన్ని చోట్ల పోలీసులు ఆంక్షలు ధిస్తున్నారు. రహదారులపై ఆందోళనల్ని అడ్డుకుంటున్నారు. వేలాది మంది పోలీసు బలగాలు రాజధాని గ్రామాల్లో మోహరించారు.
ఇదీ చూడండి: